కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ కలిసిన వి.ఆర్.ఓ సంఘం నాయకులు
కాకినాడ రూరల్ ఏప్రిల్ 7,(పిన్ పాయింట్)
కాకినాడ జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హరేంధిరప్రసాద్ ను కాకినాడ జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కి పుష్పగుచ్ఛం అందించి, ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం తరపున పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర జాయింట్ కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, రాష్ట్ర అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జె ఎ సి వైస్ ఛైర్మన్ మల్లేష్ అల్లాడి,కాకినాడ డివిజన్ కార్యదర్శి కిశోర్, జిల్లా మహిళా విభాగం నాయకురాలు సత్యవేణి,కాకినాడ అర్బన్ మండల అధ్యక్షులు సుబ్బారావు, కాజులూరు మండల అధ్యక్షులు ఈశ్వరరావు,గొల్లప్రోలు మండల అధ్యక్షులు పరమేశ్వర రాజు,కాకినాడ రూరల్ మండల వి ఆర్ ఓ నున్న సత్యనారాయణ, వీరితో పాటు తాళ్ళరేవు, కాజులూరు, కరప, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, గొల్లప్రోలు జిల్లాలోని ఇతర మండలాల నుండి పెద్ద సంఖ్యలో గ్రామ రెవెన్యూ అధికారులు తరలివచ్చి కలెక్టర్ ను కలిశారు. జిల్లా అభివృద్ధిలో మరియు రెవెన్యూ యంత్రాంగం బలోపేతంలో తాము పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా నాయకులు కలెక్టర్ విన్నవించారు.



