నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కాకినాడ ఆర్టీవో మల్లిబాబు..
కాకినాడ, మే 3,((పిన్ పాయింట్)
ఆదివారం కాకినాడలో జరుగుతున్న నీట్ 2026 పరీక్షా కేంద్రాలు తనిఖీలు భాగంగా స్థానిక గాంధీ నగరం మున్సిపల్ హై స్కూల్, గర్ల్స్ పాలిటెక్నిక్, ఫైండా సత్తిరాజు మున్సిపల్ హై స్కూల్ నందు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను కాకినాడ ఆర్డీవో ఎస్ మల్లి బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రశాంత వాతావరణంలో పరీక్షా నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలలో తాగునీరు, వైద్య ఆరోగ్య బృందాలతో పాటు విద్యుత్ ఆటంకం కలగకుండా ప్రతిపరీక్షా కేంద్రంలో జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.



