కిడ్నీ బాధితురాలికి అండగా బీజేపీ నేత -రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేసిన గుంటూరి సోమరాజు కాకినాడ రూరల్, మార్చి 20,(పిన్ పాయింట్) ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని బీజేపీ సీనియర్ నాయకుల
కాకినాడ రూరల్, మార్చి 20,(పిన్ పాయింట్)
ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని బీజేపీ సీనియర్ నాయకులు గుంటూరి సోమరాజు చాటిచెప్పారు. పిఠాపురం రెండో వార్డుకు చెందిన కిడ్నీ బాధితురాలు సుధా వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన తన వంతు సాయంగా రూ. 20,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే....పిఠాపురం 2వ వార్డుకు చెందిన సుధా (38) గత మూడు సంవత్సరాలుగా రెండు కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్నారు. భర్త సత్యనారాయణ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇద్దరు కుమారులు ఉన్న ఈ పేద కుటుంబం, సుధా వైద్య ఖర్చులకు డబ్బుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ రూరల్ మండలం పి.వెంకటాపురం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గుంటూరి సోమరాజు, బాధితురాలి కుటుంబ సభ్యులను తన నివాసానికి పిలిపించి ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు అనుసూరి తాతబ్బాయి, బావిశెట్టి శ్రీను, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్వీఎస్ రాజుల సమక్షంలో రూ. 20 వేల విలువైన చెక్కును సుధా కుటుంబ సభ్యులకు సోమరాజు అందజేశారు.
ఈ సందర్భంగా గుంటూరి సోమరాజు మాట్లాడుతూ ఆర్థిక సాయం కోసం వచ్చిన వారికి నా వంతుగా ఈ చిన్న సాయం చేశానన్నారు. మాజీ సర్పంచ్ తాతబ్బాయితో కలిసి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ,ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఇలాంటి బాధితుల సమస్యలను తీసుకెళ్లి, నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం నుండి కూడా సాయం అందేలా కృషి చేస్తామన్నారు.సోమరాజు ఎంతో మందికి నిశ్శబ్దంగా సాయం చేస్తున్నారు. తలుపు తట్టి అడిగితే కాదనని మంచి వ్యక్తిత్వం ఆయనది. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి అని మాజీ సర్పంచ్ తాతబ్బాయి కోరారు.ఈ కార్యక్రమంలో బాలు, రాంబాబు, పెంకె కృష్ణారావు, విత్తనాల సత్తిబాబు, గణేష్, ముత్తారావు, బావిశెట్టి సత్తిబాబుతో పాటు పి. వెంకటాపురం, పండూరు గ్రామస్తులు, బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమకు అండగా నిలిచిన సోమరాజుకు సుధా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.



