ఇంద్రపాలెంలో " పిల్లి"దంపతులు చే'టాప్ నాచ్' మెన్స్ వేర్ ప్రారంభం
కాకినాడ రూరల్, మార్చి 14:
కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'టాప్ నాచ్' వస్త్ర షోరూమ్‌ను శనివారం అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి మరియు సత్యనారాయణమూర్తి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
తొలుత షోరూమ్ వద్ద రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతలక్ష్మి దంపతులు షోరూమ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం నగర స్థాయి ఫ్యాషన్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. పురుషుల కోసం సరికొత్త వెరైటీలు, లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా బ్రాండెడ్ దుస్తులను ఒకే చోట అందించడం విశేషమని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ, నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకే అందించాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపార ప్రముఖులు మరియు ఇంద్రపాలెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటైన 'టాప్ నాచ్' షోరూమ్ నిర్వాహకులకు పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి దంపతులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.



