​సామర్లకోట, మార్చి 15,(పిన్ పాయింట్) మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో వస్తున్న పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సామర్లకోట తహసిల్దార్ కే. చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన రెవెన్యూ సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​ఏజెన్సీలలో ఉన్న సిలిండర్ల నిల్వలను తహసిల్దార్ స్వయంగా పరిశీలించి, ఎక్కడా కొరత లేదని ధృవీకరించారు. సిలిండర్‌లో గ్యాస్ ఉండగానే భయంతో ముందుగానే బుక్ చేయడం వల్ల అనవసరంగా బుకింగ్‌ల సంఖ్య పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ పూర్తయిన తర్వాతే బుక్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉంటే స్థానిక సచివాలయాలను లేదా రెవెన్యూ సిబ్బందిని సంప్రదించవచ్చునని తెలిపారు.​గ్యాస్ సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు ఏదైనా ఫిర్యాదు లేదా సమాచారం కోసం మొబైల్ నంబర్: 8886903611నంబర్‌ను సంప్రదించవచ్చునన్నారు. ​ఈ తనిఖీల్లో వీఆర్వో లోవరాజు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ​
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి