నిద్రమత్తు వీడండి.. సురక్షితంగా గమ్యం చేరండి -కాకినాడ పోలీసుల"స్టాప్ వాష్ అండ్ గో"
కాకినాడ, మార్చి 30, (పిన్ పాయింట్)
రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా కాకినాడ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, మార్చి 29 మరియు 30 తేదీల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.
అలసటను దూరం చేసే "స్టాప్ వాష్ అండ్ గో"
సాధారణంగా అర్ధరాత్రి మరియు తెల్లవారుజామున వాహనదారులు నిద్రమత్తు, అలసట కారణంగా ప్రమాదాలకు గురవుతుంటారు. దీనిని అరికట్టేందుకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రమేష్, పెద్దాపురం సిసిఎస్ ఎస్సై మరియు సిబ్బంది కలిసి "స్టాప్ వాష్ అండ్ గో" కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా:సుదూర ప్రాంతాలకు వెళ్తున్న వాహనాలను ఆపి, డ్రైవర్ల ముఖం కడుక్కునేలా ఏర్పాట్లు చేశారు.వారితో కాసేపు మాట్లాడి అలసటను దూరం చేసి, తిరిగి ప్రయాణం సాగించేలా ప్రోత్సహించారు.అదే సమయంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా నిర్వహించారు.
నిద్రమత్తుగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకం. ప్రయాణం మొదలుపెట్టే ముందు తగిన విశ్రాంతి తప్పనిసరి అని అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. వేగం తగ్గించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని
తక్కువ దూరమే కదా అని వన్ వే (రాంగ్ రూట్) లో ప్రయాణించి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దన్నారు.
మద్యం మత్తులో వాహనం నడపడం చట్టరీత్యా నేరం మరియు అత్యంత ప్రమాదకరం."మీపై మీ కుటుంబం ఆధారపడి ఉందని గుర్తుంచుకోండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి - సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి" అని పోలీసులు ఈ సందర్భంగా వాహనదారులకు హితవు పలికారు.



