​న్యూ ఢిల్లీ, మార్చి 17 (పిన్ పాయింట్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఔషధ మరియు సుగంధ మొక్కల సాగులో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. రాజ్యసభలో సభ్యుడు సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ ఈ కీలక వివరాలను వెల్లడించారు. జాతీయ ఆయుష్ మిషన్ మరియు రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు సమన్వయంతో రాష్ట్రం అద్భుతమైన వృద్ధిని సాధించిందని ఆయన కొనియాడారు.​కేంద్ర మంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఔషధ మొక్కల సాగు రికార్డు స్థాయికి చేరింది,2025–26 ఆర్థిక సంవత్సరంలో 15,682 హెక్టార్లలో సాగు జరిగింది.మొత్తం 1.51 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి నమోదైంది.ఈ పంటల ద్వారా సుమారు రూ 312.79 కోట్ల ఆదాయం లభించింది.​రాష్ట్రంలో ప్రధానంగా నన్నారి, సింధూర, అశ్వగంధ, కలబంద (ఘృతకుమారి), పిప్పలి మరియు తులసి వంటి మొక్కలను రైతులు అధికంగా సాగు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ​ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 2015–2020 మధ్య కాలంలో 9,785 మంది రైతులు సబ్సిడీలు మరియు ఇతర ప్రభుత్వ రాయితీల ద్వారా ప్రయోజనం పొందారు. పంట అనంతర నిర్వహణ కోసం రాష్ట్రంలో 12 పోస్ట్-హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లను ఏర్పాటు చేశామని దేశవ్యాప్తంగా ఔషధ మొక్కల ఎగుమతులు 2020–21లో రూ 2,796 కోట్ల నుండి 2024–25 నాటికి రూ 4,508 కోట్లకు పెరగడం విశేషం అన్నారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాలు, నారు అందించడంతో పాటు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి