బరువు తగ్గించే మందులపై కేంద్రం ఉక్కుపాదం!
న్యూఢిల్లీ: దేశంలో విచ్చలవిడిగా లభిస్తున్న బరువు తగ్గించే (Weight Loss) మందుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే బరువు తగ్గించే జనరిక్ మందులు విపణిలో దొరుకుతుండటం, వాటి వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందనే ఆందోళనలు వ్యక్తమవడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) మరియు రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థలతో కలిసి పర్యవేక్షణను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బరువు తగ్గించే మందుల ప్రకటనలు, ప్రచారాలపై తక్షణమే నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అనధికారిక మందుల విక్రయాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది.



