​కాకినాడ రూరల్, ఆగస్టు 15,(పిన్ పాయింట్) కాకినాడ రూరల్ డివిజన్ పరిధిలోని డి-4 సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ జి.రాజు విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను ఏపీఈపీడీసీఎల్ ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని దక్కించుకున్నారు. ​స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ సీఎండీ చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని, అవార్డును అందుకున్నారు. ​వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో, సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. శాఖాపరమైన లక్ష్యాలను సకాలంలో చేరుకోవడంతో పాటు, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో డి-4 సెక్షన్ ముందంజలో ఉండేలా చేసినందుకు ఈ అవార్డు వరించింది. ఉత్తమ పనితీరు కనబరిచి సీఎండీ అవార్డు అందుకున్న ఏఈ జి. రాజును కాకినాడ రూరల్ విద్యుత్ శాఖ అధికారులు, లైన్‌మెన్లు, తోటి సిబ్బంది, స్థానికులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, సిబ్బంది సమష్టి కృషితోనే ఈ పురస్కారం సాధ్యమైందని, భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి