విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు విజయవాడలో పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో మధ్యాహ్నం నుండి ఈ భేటీ ప్రారంభం కానుంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, 'జనసేన ఉద్యమి' పేరుతో జరుగుతున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వాల సంఖ్య 15 లక్షల మార్కును చేరుకోగా, సభ్యత్వ నమోదు గడువును పెంచే అంశంపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టబోయే సామాజిక మరియు రాజకీయ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి