దొంగను పట్టుకుని స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు!
చిత్తూరు: ఐరాల మండలం వేదగిరివారిపల్లి పంచాయతీ గూబలవారిపల్లెలో దొంగలు హల్ చల్ చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి చోరీకి ప్రయత్నించగా గమనించిన గ్రామస్తులు, సినిమా ఫక్కీలో అతడిని వెంటాడి మరీ పట్టుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని విద్యుత్ స్తంభానికి కట్టేసి ఐరాల పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల విచారణలో ఆ వ్యక్తి తనది కాకినాడ అని చెబుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.



