కాకినాడ రూరల్ , జూన్ 26,(పిన్ పాయింట్) కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓటరు నమోదు, జాబితా సవరణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కో-ఆర్డినేటర్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి సూచించారు. తొలుత తూరంగి గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రత్యేక కార్యక్రమంలో పిల్లి దంపతులు పాల్గొని, బి ఎల్ ఏ లు, పార్టీ కార్యకర్తలు, క్లస్టర్ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లతో కలిసి దిశానిర్దేశం చేశారు.అనంతరం తూరంగి గ్రామంలో ఎస్ ఐ ఆర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ అబ్జర్వర్, గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ హాజరై, క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రత్యేక కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి సంబంధిత బి ఎల్ ఓ లకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు, నియోజక అబ్జర్వార్ గన్ని కృష్ణ మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాల్లో కార్యక్రమాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. బి ఎల్ ఓ లు, బూత్ కన్వీనర్లు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడైనా బి ఎల్ ఓ లు లేదా బూత్ కన్వీనర్ల సహకారం అందకపోతే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కార్యాలయ ఇంచార్జి మేకా లక్ష్మణ రావు,జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, స్థానిక టీడీపీ నాయకులు, బి ఎల్ ఓ లు, క్లస్టర్ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి